MNCL: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో బుధవారం ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఫోటోగ్రాఫర్ జక్కుల రాజును డిప్యూటీ మేయర్ సల్ల రమ్య, అసిస్టెంట్ కమిషనర్ జి. రాజు శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. మున్సిపల్ కార్యక్రమాల చిత్రీకరణలో రాజు అంకితభావాన్ని కొనియాడారు. అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ
ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం


