హైదరాబాద్: 28°C
తెలంగాణ

కోతుల బెడదపై కలెక్టర్ సమీక్ష

MDK: జిల్లాలో కోతుల నివారణకు వేగవంతమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. బుధవారం DFO, DPO, మున్సిపల్ కమిషనర్లతో సమీక్షించారు. పట్టుకున్న కోతులను నిర్మల్ జిల్లాకు తరలించి, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజాప్రతినిధులు, ప్రజల సహకారంతో ఈ సమస్యను దశలవారీగా నిర్మూలించాలని సూచించారు.