హైదరాబాద్: 28°C
తెలంగాణ

పారిశుధ్య కార్మికుల డిమాండ్లను నెరవేర్చాలి

HNK: పారిశుధ్య కార్మికుల న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని కమలాపూర్ గ్రామ సర్పంచ్ పబ్బు సతీష్ డిమాండ్ చేశారు. బుధవారం కమలాపూర్ మండల పరిషత్ కార్యాలయంలో పారిశుధ్య కార్మికులు నిరసన చేపట్టగా ఆయన పాల్గొని కార్మికులకు సంఘీభావం తెలిపారు. ప్రజల ఆరోగ్యం, గ్రామాల పరిశుభ్రత కోసం పారిశుధ్య కార్మికులు చేస్తున్న కృషి వెలకట్టలేనిదని ఆయన వ్యాఖ్యనించారు.