కోనసీమ: ఓడలరేవు గ్రామం నుండి సముద్రంలో వేటకు వెళ్లి సుమారు 17 రోజులు గడిచినా ఇప్పటివరకు వారి ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఈ క్రమంలో అమలాపురం నియోజకవర్గం ఇంఛార్జ్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ వారిని పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి , మత్స్యకారుల ఆచూకీ కోసం సంబంధిత అధికారులతో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకునేలా కృషి చేస్తామని భరోసా కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
మత్స్యకారుల కుటుంబానికి పరామర్శ


