హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే

SRPT: తిరుమలగిరి మండలం తొండలో రూ. 200 కోట్లతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులను బుధవారం ఎమ్మెల్యే సామేలు పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలతో నిర్మాణం చేపట్టాలని, 18 నెలల్లో పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్, అధికారులను ఆదేశించారు. విద్యార్థులందరికీ కార్పొరేట్ స్థాయి విద్యను అందించేందుకే ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు.