హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మహిళలకు అండగా పోలీస్ శాఖ

AKP: నాతవరంలో రూరల్ సీఐ రేవతమ్మ ఆధ్వర్యంలో మహిళా సంఘాల మహిళలతో అభయ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలపై జరిగే నేరాలు, సైబర్ మోసాలు, 112 కాల్ ప్రాధాన్యతను వివరించారు. బాల్యవివాహాల వల్లే కలిగే నష్టాలను పేర్కొంటూ 498- A సెక్షన్ మీద అవగాహన కల్పించారు. మహిళలకు అండగా పోలీస్ శాఖ ఉంటుందన్నారు.