WGL: వర్ధన్నపేట నియోజకవర్గం 1వ డివిజన్ పలివెల్పుల గ్రామంలో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను ఇవాళ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు స్థానికులతో కలిసి పరిశీలించారు. నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా మెరుగైన రవాణా సౌకర్యాల కోసం రోడ్లను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. పనుల్లో నాణ్యత పాటిస్తూ, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
ఇబ్బందులు లేకుండా పనులు పూర్తి చేయాలి: MLA


