హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉప్పలంక NH వరకు గ్రీన్ఫీల్డ్ రోడ్డు: కలెక్టర్

కాకినాడ పోర్టు దక్షిణ ద్వారం నుంచి ఉప్పలంక వద్ద జాతీయ రహదారి వరకు 5 కిలోమీటర్ల మేర కొత్త రోడ్డు నిర్మించనున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. నాలుగు వరుసల గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మాణంపై బుధవారం అధికారులతో ఆయన సమీక్షించారు. ప్రస్తుతం రవాణా వాహనాలు 27 కిలోమీటర్లు చుట్టూ తిరిగి రావాల్సి వస్తోందని, కొత్త రోడ్డుతో ఈ దూరం భారీగా తగ్గుతుందన్నారు.