హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దౌర్జన్యాన్ని ఖండించిన ఏపీ రైతు సంఘం

AKP: నక్కపల్లి మండలం రాజయ్యపేటలో గోసల దేవుడు జిరాయితీ భూమిలోకి అక్రమంగా ప్రవేశించిన రెవెన్యూ అధికారుల దౌర్జన్యాన్ని ఏపీ రైతు సంఘం ఖండించింది. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం అప్పలరాజు మాట్లాడుతూ.. హైకోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఉన్న భూమిలోకి అధికారులు ఎలా వస్తారని ప్రశ్నించారు. ముందుగా నక్కపల్లి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న దేవుడిని పరామర్శించారు.