హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిధి అగర్వాల్‌ను విచారించిన ఈడీ

HYD: నగరంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌కు సంబంధించిన కేసులో సినీనటి నిధి అగర్వాల్‌ను ఈడీ అధికారులు రెండు గంటలకు పైగా విచారించారు. ప్రమోషన్ ద్వారా వచ్చిన చెల్లింపులు, హవాలా మార్గంలో నగదు లావాదేవీలు జరిగాయా అనే అంశాలతో పాటు బ్యాంకు ఖాతాల వివరాలపై అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. విచారణ పూర్తయ్యాక నిధి అగర్వాల్ ఈడీ కార్యాలయం నుంచి వెళ్లారు.