HYD: అల్వాల్ రెడ్డి ఎన్‌క్లేవ్‌లో మురుగునీరు పొంగిపొర్లుతున్నట్లు వచ్చిన ఫిర్యాదుపై కార్పొరేటర్ చింతల విజయశాంతి రెడ్డి ప్రాంతాన్ని పరిశీలించారు. స్థానికుల నుంచి సమస్య వివరాలు తెలుసుకున్నారు. మురుగునీటి ఇబ్బంది మళ్లీ తలెత్తకుండా తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించాలని సూచించారు.
తెలంగాణ
మురుగునీటి సమస్యపై కార్పొరేటర్ ఆరా


