హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆగస్టు 22న రాజమండ్రిలో జాబ్ మేళా

E.G: రాజమండ్రిలోని జిల్లా ఉపాధి కార్యాలయం ప్రాంగణంలో ఆగష్టు 22వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి సి.హెచ్ శిరీష బుధవారం తెలిపారు. మేళాలో పలు ప్రముఖ కంపెనీలో ప్రతినిధులు ఉద్యోగాల భర్తీకొరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని చెప్పారు. టెన్త్, ఇంటర్, ITI, ఏదైనా డిగ్రీ, డిప్లొమా చదివి 19 - 30 సంవత్సరాల వయస్సు గల అభ్యర్థులు అర్హులన్నారు.