హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైద్య చికిత్సకు రూ.3.77 లక్షల LOC

KDP: బద్వేలు 21వ వార్డుకు చెందిన భైరపు చెన్నమ్మ వైద్య చికిత్సకు ఆర్థిక సాయం కోరగా టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి మంచూరు సూర్యనారాయణ రెడ్డి స్పందించారు. రూ.3,77,051 విలువైన LOC మంజూరయ్యేలా చర్యలు తీసుకున్నారు. లెటర్‌ను కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, సూర్యనారాయణ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.