హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

‘స్థానిక సంస్థల ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు’

అన్నమయ్య: జిల్లాలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. 411 గ్రామ పంచాయతీల్లో పోల్ కమ్యూనికేషన్ పూర్తయిందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గుర్తింపు, సున్నిత పోలింగ్ కేంద్రాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను పూర్తిస్థాయిలో అమలు చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.