GNTR: వట్టిచెరుకూరు ఊర చెరువు అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ సీ.యం. సాయికాంత్ వర్మ బుధవారం పరిశీలించారు. ‘ప్రతి ఒక్కరికీ నీరు’ లక్ష్యంతో అమలు చేస్తున్న ప్రధానమంత్రి కృషి సంచయి యోజన కింద చెరువు అభివృద్ధి పనులకు రూ.50 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. ఊర చెరువును ఆహ్లాదకరంగా, సుందరంగా తీర్చిదిద్దుతున్నామని కలెక్టర్ పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
చెరువు అభివృద్ధి పనులపై కలెక్టర్ తనిఖీ


