హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా మారెమ్మవ్వ నూతన దేవాలయం ప్రారంభం

ATP: గుంతకల్లు మండలం నాగసముద్రం గ్రామంలో బుధవారం నూతన మారెమ్మవ్వ దేవాలయం ప్రారంభోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ పూజ కార్యక్రమానికి వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గాది లింగేశ్వర బాబు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. సకాలంలో వర్షాలు పడి పంటలు బాగా పండాలని ఆ అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు.