NDL: విద్యార్థి దశలో చెడు వ్యసనాలకు బానిస అయితే జీవితాలు నాశనం అవుతాయని, బాగా చదివి ఉన్నత ఉద్యోగాలు సాధించాలని ఏఎస్పీ సుస్మిత పేర్కొన్నారు. బుధవారం నంద్యాల ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులకు ఆమె సూచనలు చేశారు. మత్తు పదార్థాలకు బానిస కావొద్దన్నారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ.. బాగా చదివాలన్నారు. మంచి ఉద్యోగాలు సాధించి కుటుంబాలకు అండగా నిలవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఏఎస్పీ సుస్మిత విద్యార్థులకు కీలక సూచనలు


