హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'త్వరలో న్యాయవాదుల రక్షణ బిల్లు పూర్తి'

విజయనగరం బార్ కౌన్సిల్ సభ్యులు, బీజేపీ రాష్ట్ర కార్యాలయ ఇంఛార్జ్ ఉప్పలపాటి శ్రీనివాస రాజు విజయనగరం అడ్వకేట్ బార్ అసోసియేషన్‌ను సందర్శించి న్యాయవాదులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా న్యాయవాదుల రక్షణ బిల్లు డ్రాఫ్టింగ్ దశలో ఉందని, త్వరలోనే పూర్తి కానుందని తెలిపారు. అనంతరం సభ్యులు శ్రీనివాస రాజును శాలువాతో సత్కరించారు.