హైదరాబాద్: 28°C
తెలంగాణ

నాణ్యమైన పౌర సేవలు అందించాలి: కలెక్టర్

JN: మున్సిపాలిటీ ఆదాయ వనరులను పెంచడంతో పాటు ప్రజలకు నాణ్యమైన పౌర సేవలు అందించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన మున్సిపాలిటీపై సమీక్షలో పాల్గొని ఆయన మాట్లాడారు. వార్డుల వారీగా పారిశుద్ధ్య రూట్ మ్యాప్ రూపొందించి ఆన్‌లైన్‌లో పొందుపరచాలని, పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.