హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: గిద్దలూరులో మంచినీరు వృథా

ప్రకాశం: గిద్దలూరు మున్సిపాలిటీ పాండురంగ రెడ్డి నగర్ డీఆర్ఆర్ అపార్ట్‌మెంట్ సమీపంలో మంచినీటి పైపులైన్ లీకేజీతో భారీగా నీరు వృథాగా పోతోంది. లీకేజీ కారణంగా రహదారిపై నీరు ప్రవహిస్తూ స్థానికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రజలకు సరఫరా చేయాల్సిన మంచినీరు ఇలా వృథా అవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి లీకేజీని అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.