హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైన్ షాపును తనిఖీ చేసిన ఎక్సైజ్ అధికారులు

PLD: ఆరెపల్లిలోని శ్రీ లక్ష్మి వైన్స్‌ను ఈపూరు ఎక్సైజ్ అధికారులు తనిఖీ చేసి రసాయన పరీక్షల కోసం మద్యం శాంపిల్ సేకరించారు. మద్యం నిల్వలు, బీరు సీసాలను పరిశీలించి, ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా వివరాలు నమోదు చేశారు. డెకాయ్ ఆపరేషన్ ద్వారా మద్యం విక్రయ ధరలను కూడా నిర్ధారించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం చట్టరీత్యా నేరమని చెప్పుకొచ్చారు.