ASR: జీకేవీధి ఏకలవ్య మోడల్ స్కూల్‌ను బుధవారం చింతపల్లి డీఎస్పీ తిరుపతిరావు సందర్శించారు. స్థానిక సీఐ సుధాకర్, ఎస్సై సురేష్‌తో పాఠశాలలో విద్యార్థులతో సమావేశమయ్యారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద లింకులు, సందేశాలకు స్పందించవద్దని సూచించారు. గంజాయి, డ్రగ్స్ తదితర మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలు, వాటికి దూరంగా ఉండాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
పాఠశాలను సందర్శించిన డీఎస్పీ


