హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆర్‌ఎస్‌ఐ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎస్పీ

KDP: జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో ఆధునీకరించిన ఆర్ఎస్ఎస్ఐ కార్యాలయాన్ని ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యాలయాన్ని పరిశీలించి సిబ్బంది విధులను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. అలాగే ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు,ఆర్ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.