హైదరాబాద్: 28°C
తెలంగాణ

'బాధితులకు సకాలంలో వైద్యం అందించాలి'

NRPT: పాము కాటు బాధితులకు సకాలంలో మెరుగైన వైద్యం అందించి ప్రాణనష్టం నివారించాలని వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి వైద్యాధికారులను ఆదేశించారు. కొత్తకోట పీహెచ్‌సీని తనిఖీ చేసి యాంటీ స్నేక్ వెనం, కుక్కకాటు మందుల నిల్వలను పరిశీలించారు. గర్భిణులకు హెమోగ్లోబిన్ పరీక్షలు నిర్వహించాలని సూచించారు. అనంతరం ఆర్‌అండ్‌ఆర్ కేంద్రం, జెడ్పీహెచ్‌ఎస్‌ను సందర్శించారు.