GNTR: తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణ మంచి మనసు చాటుకున్నారు. సంగంజాగర్లమూడి ఎస్టీ కాలనీలో 33 మంది విద్యార్థులకు నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. వివిధ కార్యక్రమాల్లో సత్కారంగా అందుకున్న శాలువాలను వృథా చేయకుండా, వాటిని వస్త్రాలుగా కుట్టించి బుధవారం పిల్లలకు అందించారు. ఎంఈవోలు లక్ష్మీ నారాయణ, జయంతి బాబు పాల్గొని తహసీల్దార్‌ను అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
విద్యార్థులకు తహసీల్దార్ నూతన వస్త్రాలు


