హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రూ.150 కోట్లతో పెద్దపల్లి బైపాస్ నిర్మాణం'

PDPL: గ్రామీణ ప్రాంతాలకు అధునాతన రోడ్డు సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. బుధవారం సుల్తానాబాద్ పట్టణంలో మంత్రులు శ్రీధర్‌బాబు, తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్ విజయరమణారావుతో కలిసి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. పెద్దపల్లి పట్టణానికి రూ.150 కోట్లతో బైపాస్ రోడ్డు నిర్మాణం చేపడుతున్నామని మంత్రి తెలిపారు.