కృష్ణా: తెలుగు భాష పరిరక్షణకు ప్రత్యేక చర్యలు అవసరమని గన్నవరం MLA యార్లగడ్డ వెంకట్రావు శాసనసభలో బుధవారం ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటర్‌లో తెలుగును తప్పనిసరి చేయాలని కోరారు. దీనిపై మంత్రి నారా లోకేశ్ సానుకూలంగా స్పందిస్తూ, తెలుగు పరిరక్షణకు ఉన్నతస్థాయి సలహా కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. అందులో యార్లగడ్డను సభ్యుడిగా చేర్చాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
తెలుగు పరిరక్షణకు కమిటీ: గన్నవరం MLA


