హైదరాబాద్: 28°C
తెలంగాణ

తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఏజెన్సీ బంద్

BDK: చర్లలో తుడుందెబ్బ ఆధ్వర్యంలో చేపట్టిన ఏజెన్సీ బంద్ విజయవంతమైందని నాయకులు తెలిపారు. బంద్‌లో భాగంగా విద్యాసంస్థలు, వ్యాపార, వాణిజ్య సంస్థలను మూసివేశారు. 5వ షెడ్యూల్, 1/59, 1/70, పేసా చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని, ఏజెన్సీ ప్రాంతాల్లో 100 శాతం ఉద్యోగాల కోసం ప్రత్యేక జీవో జారీ చేయాలని తుడుందెబ్బ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వరప్రసాద్ డిమాండ్ చేసారు.