హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డుపైనే కళేబరం.. దుర్వాసనతో ఇబ్బందులు..!

KMM: నేలకొండపల్లి రోడ్డులో రోడ్డు పక్కనే కొద్దిరోజులుగా మృతిచెందిన గేదె కళేబరంను కుక్కలు లాక్కొచ్చాయి. రోడ్డున వెళ్లే ప్రజలు, ప్రయాణికులు, వాహనదారులు దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారు. పడేసిన జంతు కళేబరంను గ్రామపంచాయతీ సిబ్బంది తొలగించడం లేదంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఆ కళేబరాన్ని తొలగించాలని కోరుతున్నారు.