హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుడిసెలో నివసిస్తున్న వారికి తొలి ప్రాధాన్యత: MPDO

ADB: బోథ్ మండలంలోని ధన్నూరు, నాగపూర్, జైనూరుపల్లె గ్రామాల్లో బుధవారం రెండవ దశ ఇందిరమ్మ ఇండ్ల సర్వే నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీడీవో రమేశ్ మాట్లాడుతూ.. గుడిసెలో నివసిస్తున్న వారికి తొలి ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. దశలవారీగా అర్హులందరికీ ఇండ్లు మంజూరవుతాయని పేర్కొన్నారు. ఇండ్లు ఇప్పిస్తామని దళారులను నమ్మవద్దని ప్రజలకు సూచించారు.