హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సచివాలయంలో జేసీ ఆకస్మిక తనిఖీ

VZM: ఐవీఆర్‌ఎస్‌ ద్వారా అందిన ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా జేసీ ఎస్. సేధు మాధవన్‌ బుధవారం నెల్లిమర్ల మండలం కొండవెలగాడ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయం ద్వారా అందుతున్న ప్రభుత్వ సేవలపై క్షేత్రస్థాయి పరిస్థితులను స్వయంగా తెలుసుకునేందుకు పలువురు రైతులకు ఫోన్‌ చేశారు. ఈ మేరకు వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.