PLD: గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమితులైన టీడీపీ నేత వర్ల రామయ్య, దళవాయి రమాదేవికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. బుధవారం వర్ల రామయ్యను నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు కలిసి అభినందించారు. పార్టీ కోసం సుదీర్ఘకాలంగా పనిచేసిన వర్ల రామయ్యకు ఎమ్మెల్సీ పదవి దక్కడం ఆనందంగా ఉందన్నారు. మండలిలో తన అనుభవంతో ప్రజా సమస్యలు బలంగా వినిపించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
వర్ల రామయ్యకు ఎమ్మెల్యే అభినందనలు


