హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి'

SRPT: విద్యార్థినులు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ పెండెం వెంకటరమణ సూచించారు. బుధవారం తుంగతుర్తిలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో విద్యార్థినులకు ఆరోగ్యం, పారిశుద్ధ్యం, పరిసరాల పరిశుభ్రతలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుత సీజన్‌లో ఆరోగ్య విషయాలపై జాగ్రత్తగా ఉండాలన్నారు.