హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన అవసరం'

SRD: మహిళలు రొమ్ము క్యాన్సర్ పట్ల అవగాహన కలిగి ఉండాలని, ఎలాంటి అపోహలు నమ్మవద్దని ప్రోగ్రామ్ ఆఫీసర్ వెంకట్ తెలిపారు. బుధవారం సదాశివపేటలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. 35 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రారంభ దశలోనే వ్యాధిని గుర్తిస్తే సులువుగా నయం చేయవచ్చని స్పష్టం చేశారు.