హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు

JN: ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని రఘునాథ్‌పల్లిలో లూయిస్ డాగురెకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఫోటోగ్రాఫర్ల సంఘం మండల అధ్యక్షుడు ఇట్టబోయిన వెంకటేష్‌ ఆధ్వర్యంలో పూలమాల వేసి జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఫోటోగ్రాఫర్ల సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. ఫోటోగ్రఫీ రంగం ప్రాధాన్యతను పలువురు వివరించారు.