NLG: గుడిపల్లి రైతు వేదికలో బుధవారం ఎల్ నినో ప్రభావం వల్ల వేసే పెసలు,కందిపప్పు,అలసంద పంటల గురించి రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ కున్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులు వరి లాంటి పంటలు కాకుండా చిరుధాన్యాలు పండించి రైతుపై భారం పడకుండా అప్పుల ఊబిలో చిక్కుకోకుండా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ ఆఫీసర్ రాజు ఉన్నారు.
తెలంగాణ
గుడిపల్లిలో పంటలపై రైతులకు అవగాహన కార్యక్రమం


