హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి'

NRML: దస్తూరాబాద్ ప్రభుత్వ పథకాలను వినియోగించుకొని గ్రామాన్ని జిల్లాలోని ఆదర్శ గ్రామంగా నిలపాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు వెల్లడించారు. మండలంలోని ఆకొండపేట గ్రామంలో రైతులు, ప్రజలతో సమావేశం నిర్వహించి ప్రభుత్వ పథకాలను వివరించారు. వ్యవసాయంలో పంట మార్పులు చేసి, పండ్లు, కూరగాయలు, విభిన్న రకాల ఉద్యాన పంటలపై దృష్టి సారించాలని అన్నారు.