హైదరాబాద్: 28°C
తెలంగాణ

జెండర్ రిసోర్స్ సెంటర్ ప్రారంభం

SRD: మహిళలు, బాలికల రక్షణ, హక్కుల పరిరక్షణతో పాటు సామాజిక సమస్యల పరిష్కారానికి జెండర్ రిసోర్స్ సెంటర్ కీలకమని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్‌చెరు మండల మహిళా సమాఖ్యలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. గృహహింస, బాల్య వివాహాలు, మానవ అక్రమ రవాణా, మద్యపానం, మూఢనమ్మకాలను అరికట్టేందుకు కృషి చేయాలన్నారు.