హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నిరుద్యోగుల సమస్యలపై AIYF నిరసన

కడప కలెక్టరేట్‌ వద్ద AIYF జిల్లా సమితి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. డీఎస్సీ అవకతవకలపై హైకోర్టుతో విచారణ జరిపించాలన్నారు. పెండింగ్‌ నియామకాలు పూర్తి చేయాలని, స్థానిక యువతకు ఉపాధి కల్పించాలని కోరారు. SC, ST, BC బ్యాక్‌లాగ్‌ పోస్టులు భర్తీ చేయాలని కోరారు.