MHBD: మహబూబాబాద్ మండలంలోని పాత రెడ్యాల గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంటి వద్ద బైనింగ్ తీగకు తడి బట్టలు ఆరేస్తుండగా పర్శక బుచ్చమ్మ(56) కరెంట్ షాక్‌కు గురై మృతి చెందారు. కిందపడిపోయిన ఆమెను వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.
తెలంగాణ
బట్టలు ఆరేస్తుండగా కరెంట్ షాక్.. మహిళ మృతి


