హైదరాబాద్: 28°C
తెలంగాణ

'వ్యసనాలకు దూరంగా ఉండాలి'

SRPT: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ గీత అధ్యక్షతన బ్రహ్మాకుమారీస్ ఆధ్వర్యంలో ‘వ్యసన ముక్త భారత్ అభియాన్’ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థులతో వ్యసన రహిత జీవనంపై ప్రతిజ్ఞ చేయించారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవనం సాగించాలని సూచించారు. యోగ ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, బ్రహ్మాకుమారీస్ ప్రతినిధులు పాల్గొన్నారు.