హైదరాబాద్: 28°C
తెలంగాణ

భక్తిశ్రద్ధలతో గిరి ప్రదక్షిణ కార్యక్రమం

SDPT: బెజ్జంకిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద బుధవారం గిరిప్రదక్షిణ భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. చినజీయర్‌ స్వామి ముచ్చింతల నుంచి పంపించిన హృదయ కలశాన్ని భక్తులు చేతబట్టి, స్వామివారి కీర్తనలు, భజనలు ఆలపిస్తూ ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు. ఇకపై ప్రతి నెలా గిరిప్రదక్షిణను సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభించనున్నట్లు సర్పంచ్‌ బొల్లం శ్రీధర్‌ తెలిపారు.