ADB: సిరికొండ మండలం లక్కంపూర్ గ్రామంలో మట్టి రోడ్లు చిత్తడిగా మారడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కురిసిన తేలికపాటి వర్షానికే రోడ్లన్నీ బురదమయంగా మారాయని వాపోయారు. ప్రతి వర్షాకాలంలో రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. అధికారులు స్పందించి సీసీ, బీటీ రోడ్లు నిర్మించాలని కోరారు.
తెలంగాణ
VIDEO: చిత్తడిగా మారిన మట్టి రోడ్లు


