SDPT: కోహెడ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద బుధవారం ఉదయం కోళ్ల ఆటో బోల్తా పడింది. తంగళ్లపల్లి నుండి వస్తున్న క్రమంలో డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో వాహనం అదుపుతప్పి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని స్థానికులు తెలిపారు.
తెలంగాణ
కోహెడలో కోళ్ల ఆటో బోల్తా


