హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీపీఎం సీనియర్ నాయకుడు మృతి పలువురు నివాళి

JNG: పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన సీపీఎం పార్టీ సీనియర్ నాయకులు జీడి సత్యనారాయణ వృద్ధాప్యంతో ఇవాళ తెల్లవారుజామున మరణించారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచనల మేరకు స్థానిక BRS నాయకులు ఆయన మృతదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.