హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆయిల్ మిల్లులో ప్రమాదం.. మహిళకు చేయి విరిగింది

WGL: నల్లబెల్లి కేంద్రంలోని ఓ ఆయిల్ మిల్లులో పని చేస్తుండగా రంగాపురం గ్రామానికి చెందిన కవిత ప్రమాదవశాత్తు మిషన్‌లో చిక్కుకుంది. ఈ ఘటనలో ఆమె చేయి తీవ్రంగా విరిగింది. స్థానికులు వెంటనే ఆమెను మెరుగైన వైద్యం కోసం నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.