హైదరాబాద్: 28°C
తెలంగాణ

మాజీ మావోయిస్టు ఇన్నారెడ్డికి బెయిల్ మంజూరు

WGL: మాజీ మావోయిస్టు ఇన్నారెడ్డి అలియాస్ గాదె ఇన్నయ్యకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ. 25వేల పూచీకత్తుతో రెండు బాండ్లు సమర్పించాలని, ప్రతిశుక్రవారం కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో హాజరుకావాలని ఆదేశించింది. UAPA కేసులో ఎనిమిది నెలలుగా జైల్లో ఉన్న ఇన్నారెడ్డిని గత డిసెంబర్‌ 21న జఫర్‌గఢ్‌లోని ఆయన ఇంట్లో NIAఅధికారులు అదుపులోకి తీసుకున్నారు.