హైదరాబాద్: 28°C
తెలంగాణ

రూపుదిద్దుకుంటున్న బడా గణేష్

HYD: ఖైరతాబాద్ బడా గణేశ్ విగ్రహ తయారీ పనులు వేగవంతమయ్యాయి. ప్రస్తుతం వెల్డింగ్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. అవి ముగియగానే మట్టి పనులు చేపడతామని ఉత్సవ కమిటీ తెలిపింది. సమయాభావంతో కార్మికులు 3 షిఫ్టుల్లో శ్రమిస్తున్నారు. మట్టి పనులకు మరో 10 రోజులు పడుతుందని, అనంతరం రంగుల పనులు ప్రారంభించి సమయానికి దర్శనం కల్పిస్తామన్నారు.