MDK: వెల్దుర్తి మండల కేంద్రంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభించాలని కోరుతూ చర్లపల్లి తండా వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారానికి ఏడో రోజుకు చేరాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు దీక్షల్లో పాల్గొని నిరసన తెలిపారు. పబ్లిక్ స్కూల్ మంజూరు అయ్యేంత వరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.
తెలంగాణ
VIDEO: ఏడో రోజుకు చేరిన రిలే నిరాహార దీక్షలు


