హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా ప్రపంచ ఫొటోగ్రపీ దినోత్సవ వేడుకలు

ADB: బోథ్ మండల కేంద్రంలో తెలంగాణ ఫొటో, వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు జెండాను ఆవిష్కరించి, కెమెరా సృష్టికర్త లూయిస్ డాగురే చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. ప్రతి జ్ఞాపకాన్ని ఫోటోలో బంధిస్తున్న ఫొటోగ్రాఫర్ల సేవలు మరువలేనివని నాయకులు పేర్కొన్నారు.